సోమవారం, జనవరి 17, 2011

బ్లాగులు- వ్యాఖ్యలు -8

Dhyan Buddha at Amaravati   Photo: cbrao


ఈనాడు లో నా కధ ... అమ్మో దురద

అమ్మో దురద  కధ బాగుంది. ఈనాటి కుల దురభిమానాలపై చక్కని చురక.  అమెరికా తెలుగు సంఘాలు ఈ కుల గజ్జి దురద వలనే  ముక్కలయ్యాయి.

http://rajakiyalu.blogspot.com/2010/08/blog-post_29.html

వ్యాపకాల జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు

వడ్డెర చండీదాస్“హిమజ్వాల” ప్రచురణ గురించిన ఒక అపురూప విషయం మీ జ్ఞాపకాల ద్వారా తెలిసింది. నెనర్లు.

http://bhandarusrinivasarao.blogspot.com/2010/08/blog-post_29.html

బ్లాగరులారా ఇవినాకువద్దు

అవును కదా! మిత్రులు అనాలోచితంగా పంపే కానుకలివి.

http://visakhateeraana.blogspot.com/2010/08/blog-post_31.html

ఓ మంచి కామెంటు !! చూడడం మరవద్దు

తెలుగు వికీపీడియాలో ఉన్న సదుపాయాలను దుర్వినియోగం చేసేవారు ఎప్పుడూ ఉంటారు. వ్యాసాలలో చేసిన మార్పులను వికీ రచయితలు, సంపాదకులు సదా జాగరూకతతో గమనిస్తూ, తగిన మార్పులు చేస్తుంటారు. ఈ అనామక రచయితల వల్ల వికీ కి  ప్రమాదం లేదని విశ్వసిస్తాను.  

తెలుగు బాట నడకలో మిమ్ములను మీరు పరిచయం చేసుకుని ఉండాల్సింది అక్కడి కార్యకర్తలకు. సరే, వచ్చే సంవత్సరం తెలుగు బాట నడకలో అందరినీ పరిచయం చేసుకోగలరు. హైదరాబాదులో నెల నెలా జరిగే తెలుగు బ్లాగర్ల సమావేశానికి హాజరవవచ్చు.

http://blaagubaabji.blogspot.com/2010/08/blog-post_17.html

మడతపేజీ

బ్లాగు టపాలతో ఒక పుస్తకం రావడం ప్రయోగాత్మకం. మడతపేజీ పుస్తకం గా వెలువడటం ఆనందకరం. అభినందనీయం.

"బ్లాగు సంకలనాలతో ఒక పుస్తకం రావడం  ఇదే మొదలు." -వీవెన్

2008 లో సాహితీ పరులు, పాత్రికేయులతో సరసాలు అనే పుస్తకం వెలువడింది. నా ప్రపంచం బ్లాగులో వచ్చిన టపాలతో ఈ సంకలనం వచ్చింది.  "సాహితీపరులతో సరసాలు" ఈ పరంపర లో వచ్చిన తొలి వ్యాసం ఇక్కడ చూడవచ్చు.

ఈ పుస్తక వివరాలు ఇక్కడ చూడవచ్చు.

చావా కిరణ్ పోతీ. కాం సహకారం తొ రెండు పుస్తకాలు ప్రచురించారు. అయితే అవి Books on Demand పద్ధతి లో వెలువరించినవి. ఈ పుస్తకాలు ప్రత్యేక వర్గంగా పరిగణించాలి.

http://prabhavabooks.blogspot.com/2010/09/blog-post_20.html

చుప్కే...చుప్కే...చోరీ!(గ్రంధ చౌర్యాలు ---కొన్ని పిట్ట కథలు..)

"రావూరి భరద్వాజ గారి కాదంబరి నవల, స్వార్ధపరుడు కి చాలా దగ్గర పోలికలున్నాయని...దాదాపుగా రెండూ ఒకేలా వున్నాయని"  -నటరాజన్ తెనాలిలో హోటల్ లో పనిచేస్తున్న దరిదాపుల్లో, రావూరి భరద్వాజ తెనాలి నుంచి ఆలపాటి రవీంద్రనాథ్ సంపాదకత్వంలో వెలువడే జ్యోతి మాసపత్రికలో పని చేస్తున్నారు.  శారద కధ చదివిన స్ఫూర్తితో భరద్వాజ తన నవల వ్రాసి ఉండవచ్చు. ఆ రెండు రచనలు నేను చదవలేదు. ఒక రచన చదివి inspire అయి వ్రాసే రచనలను కాపీ అనవచ్చునా? ఒకే సామాజిక పరిస్థితులలో నివసించిన ఈ ఇద్దరూ ఒకే విషయం పై స్పందించి తమ పద్ధతిలో తమ రచన వెలువరించి ఉండవచ్చు. Great men think alike అని నానుడి. ఖచ్చితంగా   తెలుసుకోవాలంటే భరద్వాజ గారిని అడిగి తెలుసుకోవచ్చు.

http://kalpanarentala.blogspot.com/2010/09/blog-post_23.html


ఎవరైనా నాకు రెసెపీ లు పంపిస్తారా?

షడ్రుచులు అంటూ ఫొటోలు కూడా పెట్టి నోరూరుంచేలా టపాలు రాస్తూ ఆడవాళ్లను వంటింటికతుకుపోయేలా కుట్ర చేస్తున్న జ్యోతక్క బ్లాగును అన్ని అగ్రిగేటర్లనుంచీ బహిష్కరించాల్సిందే. ఫెమినిజ్మ్ జిందాబాద్. మా కాలేజీ రోజుల్లో -మీరు నమ్మండి-నమ్మకపోండి మాకు ఇచ్చిన వకృత్వ పోటీ అంశం "Kitchen is the kingdom of women". ఈ వంటల బ్లాగులకు వ్యతిరేకంగా ఒక కొత్త సంఘం స్థాపనకు వేళయింది. మొదటి కార్యక్రమం ధర్నా ఎక్కడ? జ్యోతక్క ఇంటిముందు -షడ్రుచులుకు వ్యతిరేకంగా , అది తక్షణం మూసివేయాలని, ఆడవారు వంటింటి బానిసలు కారు అంటూ నినాదాలిస్తూ.

ఈ సరదా పోస్ట్ కు, సరదాగా వ్రాసిన వ్యాఖ్య.

http://kalpanarentala.blogspot.com/2010/09/blog-post_27.html


సిద్ధార్థ తెలుగు ప్రయాణం!

ఉత్తర అమెరికా విద్యార్ధులకు  నిత్య జీవితంలో తెలుగు కంటే స్పానిష్ ఎక్కువ ఉపయుక్తకరం. అయితే మాతృబాష కమ్మదనం మరే బాషా అందుకోజాలదు. తెలుగు నేర్చుకోవటం అంటే అమ్మఒడిలో  సేదతీరటం. తెలుగు అబ్బాయి సిద్ధార్ధకు తెలుగు   నేర్చుకోవటంలో ఆసక్తి, ప్రేరకం కలిగించటంలో, ఉత్సాహం తో ఉరకలు వేసే తెలుగు శివమైన అఫ్సర్   విజయవంతమవటం సులభం.  అఫ్సర్  ఉపజ్ఞ ఇందుకు దోహదపడుతుంది.  ఈ ఉత్సాహం కొనసాగితే, సిద్ధార్ధ తెలుగులో బ్లాగే దిశలో పయనించగలడని  ఆశించవచ్చు.

http://afsartelugu.blogspot.com/2010/10/blog-post_06.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి