శనివారం, జనవరి 22, 2011

బ్లాగులు- వ్యాఖ్యలు -10


Bhongir Fort Photo: cbrao
మారేడు మిల్లి - ట్రిప్

"అడవిలో చిన్న వంతెనా దానికింద గల గల పారే యేరు ", "ఆ వంతెన మీదే కూర్చున్నాం అక్కడ నా సెల్లోని ముఖేష్ లతా రఫీ పాటలు విని నా ఫ్రెండ్స్ చాలా ఫార్మల్ గా బిహేవ్ చేసారు "
-రాత్రి 11 గంటల సమయంలో చిరుత,పులి అక్కడి వంతెన కిందగా రోడ్డు దాటుతాయి. వంతెన కింద నీటికై దుప్పులొస్తే, వాటి కోసం పులులొస్తాయి. మీరు పాటలతో అడవి నిశ్శబ్ద సౌందర్యాన్ని భంగం చెయ్యటం వలన అడవి జంతువులు తమ దారి మార్చుకొని వంతెనకు దూరంగా వెళ్లి వుంటాయి. మీరు పులిని చూసే అవకాశం కోల్పోయారు. యాత్రికులను అక్కడి గైడ్ అడవి జంతువులను చూపటానికి భద్రాచలం రోడ్ లోని వంతెన దగ్గరకే తీసుకు వెళ్తాడు సాధారణంగా. అడవిలో రాత్రుళ్లు నిశ్శబ్దంగా ఉంటూ అడవి చప్పుళ్లను, జంతువుల అరుపులను ఆనందించాలి.

http://lipilenibasha.blogspot.com/2010/09/blog-post_5962.html


ఓ రేంజ్ బోర్ కథ ‘ఆరెంజ్’

సినిమాకు కధే ప్రాణమని పలుమార్లు ఋజువయ్యింది గతంలో. ఆరంజ్ సినిమా ప్రొమోలు చూసి భాస్కర్ గొప్ప ప్రేమ కధా చిత్రం ఇస్తాడనుకున్నా. చిత్ర నిర్మాణానికి ముందే కధ ను కొందరు నమ్మకమైన సమీక్షకులకు చెప్పి (వారు కధను ఎక్కడా లీక్ చెయ్యమని వాగ్దానం చేసాక) వారి అభిప్రాయం తీసుకుని మార్పులు చేసి ఉంటే ఇలా నిరాశ కలిగేది కాదు కద. సమీక్షకులు కధను బహిరంగపరుస్తారనే (leak) భయం ఉంటే, హాలివుడ్ లో లాగా మనము కూడా పటిష్ఠమైన కధా శాఖను చిత్ర నిర్మాణం లో ఒక భాగంగా చేసుకుంటే బలమైన కధా వస్తువు చిత్రానికి లభిస్తుంది. చిత్ర విజయానికి ఈ కధా శాఖ తోడ్పడగలదు.

http://navatarangam.com/2010/11/orange-review/

నా సాహితీజీవనంలో జరిగిన కధ -మల్లాది

ప్రసాదరావు గారి కోరికలలో  పెన్ స్కెచెస్  మాత్రమే గాకుండా  తను సంపాదకత్వం వహించిన కళ  లోని ముఖ్య వ్యాసాలు ఒక సంపుటంగా రావాలన్నది మరొకటి. వెనిగెళ్ల  వెంకటరత్నం సహకారంతో  పొట్టిశ్రీరాములు  తెలుగు విశ్వవిద్యాలయం  వారు శిల్ప చిత్ర కళ పరిణామం  -చలసాని ప్రసాద రావు అనే పుస్తకాన్ని అందంగా ప్రచురించారు. ఈ సంపుటం వెలుగు చూడకముందే ప్రసాదరావు మరణించారు. ప్రసాదరావు గారిని మృత్యువుకు దగ్గర చేసింది సిగరెట్లే. ఈ దురలవాటు లేకుంటే మరో పది సంవత్సరాలు జీవించి ఉండేవారు.రామోజీరావు గారు మూసేసిన పత్రిక  తెలుగునాడు ఒక్కటే కాదు. న్యూస్ టైం అనే దిన పత్రిక కూడా వారు మూసివేసిన మరో  ప్రచురణ.

http://www.koumudi.net/Monthly/2010/november/index.html

మృత్యువుతో సైతం పోరాడుతున్న మల్లాది సుబ్బమ్మ 


మల్లాది సుబ్బమ్మ, రామ్మూర్తి గారు కలిసి నడిపిన వికాసం మాసపత్రికకు కొన్ని వ్యాసాలు/కధలు వ్రాశాను గతంలో. సుబ్బమ్మ గారు స్త్రీల సమస్యలపై ఎడతెగని పోరాటం జరిపారు. ఎన్నో వర్ణాంతర వివాహాలు జరిపించారు. ప్రజాహితం కోరి ఒక ట్రస్ట్‌ను స్థాపించారు. జీవిత చరమాంకం లో ఇలా మంచాన పడటం బాధాకరం. వారు కోలుకుంటారని ఆశిస్తాను.  

http://maagodavari.blogspot.com/2010/12/blog-post_08.html


తెలుగు సంజీవనిని మారిషస్ మోసుకుపోయిన ఆంజనేయుడు -సంజీవ నరసింహ అప్పడు

సంజీవ నరసింహ అప్పడు గారికి తెలుగు భాషపై అపరిమిత అభిమానం. మన దేశంలో గాక విదేశాలలో ఉన్నప్పుడు తెలుగు పై అభిమానం పెరుగుతుందని నేను నా అనుభవంలో తెలుసుకొన్నాను.అయితే సంజీవ గారికి ఈ అభిమానం ఒకింత ఎక్కువే. ఇలాంటి వారి వలనే మారిషస్ లో మన తెలుగు జండా రెపరెపలాడుతుంది. మారిషస్ లో వారి అనుభవాలతో కూడిన బ్లాగు ఒకటి సంజీవ గారు మొదలు పెట్టాలని నా అభ్యర్ధన.  

http://naalokam.com/archives/427


హైదరాబాద్ పుస్తక ప్రదర్శన -1వ రోజు

@ఉష : మరువానికి దూరం కావటం అంటే జీవితం లో కొన్నింటికి దగ్గర కావటమే. ఈ మార్పు మీకు ప్రమోదాన్నిచ్చిందని తలంపు. పుస్తకాలు పారిజాతాలు. దూరంగా ఉన్నా వాటి సుగంధం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. 2009 లో అమెరికా మిత్రులను పుస్తక ప్రదర్శనలో కలవటం ఆనందం కలిగించింది. మీరు ఒక మారు డిశంబర్లో  భారతదేశం రాగలరు.

http://deeptidhaara.blogspot.com/2010/12/1_17.html


"విజయవాడ బుక్ ఫెస్టివల్ లో "అనేక" విడుదల!"

వంశీకృష్ణ  బ్లాగు ఇప్పుడే చూశాను. విదేహ పేరుతో లేఖా సాహిత్యం అభినందనీయం. తెలుగులో లేఖా సాహిత్యం తక్కువ.  సంజీవదేవ్ లేఖా సాహిత్యం తో నాకు లేఖా సాహిత్యం పరిచయమయ్యింది. దరిమిలా లేఖల ద్వారా  సంజీవదేవ్ మంచి మిత్రులయ్యారు.

http://afsartelugu.blogspot.com/2011/01/blog-post.html


"నమ్మకం - భండారు శ్రీనివాసరావు"

అమెరికాలో భార్య పుట్టిన రోజు మరిస్తే! ఆ మరుసటి రోజు తనతో ఉంటుందో, ఉండదో, ఎప్పుడు విడాకులో అంతుబట్టదు.  పుట్టిన రోజు మరిచినా భారతదేశం లో భార్య విడాకులివ్వదు.  ఇది మన నమ్మకం.

http://bhandarusrinivasarao.blogspot.com/2010/12/blog-post_17.html


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి