గురువారం, ఫిబ్రవరి 12, 2009

స్పందన -8



Golden Gate Bridge,San Francisco,CA Photo:cbrao


వ్యంగ రాతల ప్రభావం

బ్లాగు, ఎవరి కోసం, ఎందుకోసం? ఆసక్తికరమైన విషయమేమంటే ముష్కరులు ప్రచలిత బ్లాగుల రచయితలనే లక్ష్యంగా ఎంచుకొన్నారు, తమ వ్యంగ రాతలకు. కూడలి నుంచి నిష్క్రమిస్తే వారి వ్యూహం పారినట్లే. ఓటమిని ఒప్పుకున్నట్లా?

http://parnashaala.blogspot.com/2009/02/blog-post_10.html


ఇలా జరగొచ్చు

పదిహేను సంవత్సరాల తర్వాత ,మీ కార్యాలయ సహచరులతో, మీ పిల్లలతో కూడా ఆంగ్లంలో మాట్లాడతారు.

http://ramanagandham.blogspot.com/2008/08/telugu-hindix-english.html


ఒక చెంపన కొడితే

మీరు బ్లాగరులలో మహాత్మా గాంధీలాంటి వారు. మిమ్ములను బ్లాగ్ గాంధీగా పిలువవచ్చు.

http://durgeswara.blogspot.com/2009/02/blog-post_10.html


అనంతం - శ్రీశ్రీ
శ్రీ శ్రీ వైరుధ్యాల పుట్ట. రచనలు చూడాలా, రచయిత వ్యక్తిగత లోపాలను చూడాలా? మన అభిమానం ఎవరిపైన? రచనలపైనా లేక రచయిత పైనా? రచయిత నిబద్ధుడు కాకపోతే తను చెప్పిన మంచి విషయాలకు విలువ తగ్గుతుందా? పుస్తకం గురించిన రాసిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. పుస్తక పరిచయం బాగుందని ప్రత్యేకంగా రాయనవసరం లేదనుకుంటాను.

http://pustakam.net/?p=536


క్రెడిట్ కార్డు కష్టాలు

Nice article.In the case of credit cards they are not following daily interest principle of commercial banks. Credit card companies are charging for silly mistakes like paying bills in cash. SCB charges penalty for paying credit card bills in cash.

http://kovela.blogspot.com/2009/02/blog-post_11.html


గడ్డిపూలు సుజాత బ్లాగు ప్రయాణం

"థాంక్యూ మేడమ్." అన్న రానారె వ్యాఖ్య నా జీ మైల్ ఇంబాక్స్ లో పడటంతో మీ టపా దగ్గరకు మరలా వచ్చాను. మీ బ్లాగు వ్యాఖ్యలలో "మీ రెండో వ్యాఖ్య 'ఇది ఫీడ్ కోసం.. ' అనేది అర్ధం కాలేదు." అన్నారు కదా. "This is for feed of comments." -దీని అర్థం మీ బ్లాగులో నా వ్యాఖ్య తరువాత ప్రచురించబడే వ్యాఖ్యలు నాకు మైల్ కావటానికి. సబ్‌స్క్రయిబ్ చెయ్యి: వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom) ". Email follow-up comments" అనే పెట్టెలో మొదట వ్యాఖ్య రాసినప్పుడు టిక్ పెట్టడం మరిచాను. గుర్తొచ్చి టిక్ పెట్టి "This is for feed of comments." అని రాశాను. ఇదీ దానికర్థం. బోధపడిందని తలుస్తాను.

http://sangharshana.blogspot.com/2008/11/blog-post.html



టి.వి. లో అసభ్య దృశ్యాలు

"ప్రశాంతికి న్యూస్ రీడర్ ఉద్యోగం అనుకోకుండా దొరికింది. ఇంటిపని,పిల్లల పెంపకంలో తలమునకలయి ఉద్యోగ ప్రయత్నమే మానుకుంది చాలాకాలం." - అనాలోచితంగా వెలువరించే అసభ్య దృశ్యాలు టి.వి. చూసే పిల్లలపై దుష్ప్రభావాన్ని చూపుతాయి. టి.వి.ఛానెల్స్ కు స్వయం నియంత్రణ అవసరమని మీ కధ చక్కగా చెప్పింది.

http://pramadavanam.blogspot.com/2009/01/blog-post_06.html


ఎక్కువ వ్యాఖ్యలు పొందిన టపాలు

ఈ వ్యాఖ్యల సంఖ్య తప్పుగా ఉంది. ఏ తారీకు లెక్కలివి? ఇలాంటి వాటికి As on ...date ఇస్తే బాగుండగలదు. అన్ని బ్లాగుల లెక్కలు ఒక్క రోజు తీసినవే అయితే బాగుంటుంది.

http://blog.jalleda.com/?p=137

1 కామెంట్‌:

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...

ఈ "ప్రచలిత" హిందీపదం. తెలుగులో దీనికి అర్థం లేదు. దీనికి ఉన్న తెలుగుపదం "ప్రచుర". సంస్కృత పదాలు ఆన్ని భారతీయ భాషల్లోను ఉన్నప్పటికీ అన్ని సంస్కృత పదాలకీ అన్ని భారతీయ భాషల్లోను ఒకే అర్థం లేదు. కొన్నిసార్లు ఒక భాషలో అర్థవంతమైన సంస్కృతపదం ఇంకో భాషలో బొత్తిగా అర్థహీనమై ఉంటుంది. అయినా మనం హిందీవాళ్ళ తెలిసీ తెలియని సంస్కృతాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు. అసలు భాషాపరంగా చూస్తే వాళ్ళకి సంస్కృత సంప్రదాయమే లేదు, ఉర్దూ, అరబిక్, తుర్కీ సంప్రదాయం తప్ప ! వాళ్ళకి సంస్కృతం ఒక latest 20th century fad మాత్రమే. మనది హిందీ కంటే ప్రాచీనత్వమూ, ప్రాచీన సాహిత్యమూ గల భాష..

కామెంట్‌ను పోస్ట్ చేయండి