ఆదివారం, జులై 06, 2008

అంతర్జాల వీక్షణం -4

boat_on_godavari_rjm

గోదావరి -రాజమహేంద్రవరం రైలు వంతెన

 

గోపి గోపిక గోదావరి

http://thatstelugu.oneindia.in/movies/avi/2008/06/kamalini-new-film-gopi-gopika-godavari-280608.html

దర్శకుడు వంశీ కు, గోదావరి లేకుండా సినిమా ఎలా చిత్రిస్తారు అనేది మొదటి ప్రశ్న. వంశీ కు గోదావరి నది అన్నా, అక్కడి ఇసుక తిన్నెలన్నా, గ్రామాలన్నా, అక్కడి మనుషులన్నా ఎంతో ప్రాణం. గోదావరి సినిమాతో కమలిని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఈ ఇద్దరి కలయికలో వస్తున్న కొత్త చిత్రం గోపి గోపిక గోదావరి. ఈ చిత్రం విశేషాలు thatstelugu లో చూడవచ్చు.

 

చదువు- తెలుగు మాధ్యమం

http://drbr1976.blogspot.com/2008/06/blog-post_27.html

ఇది గంభీరంగా ఆలోచించవలసిన విషయమే. పిల్లలకు మాతృభాష లో తలకెక్కినట్లుగా, మరే భాష లోను, జటిల విషయాలు బొధ పడవని కొందరు విద్యావంతులు చెప్తున్నారు. ఇది కొట్టిపారెయ్యటం కష్టం కానీ, 8 వ తరగతి వరకు తెలుగు మాధ్యం ఉండటం బాగుండునని భవదీయుడి ఆలోచన. శాస్త్ర పదాల లోని ఆంగ్ల, తెలుగు పదాలు రెండూ విధ్యార్థులకు బోధించాలి. మేరేమంటారు? భావుకుడన్ చెప్పే కథనం బాగుంది.

 

మిధ్య - Virtual reality

http://groups.google.co.in/group/AxaraYagyamu/browse_thread/thread/ab6e0937b18de3f8

మిధ్య అంటే ఏమిటి? ఒక Engineer View Point ఏమిటో చదవండి. చదివినాక మీ ఉద్యోగం మిధ్య, మీ క్లైంట్ మిధ్య అని అనిపిస్తే? మీ చెయ్యి గట్టిగా గిల్లమని పక్కవారికి చెప్పండి. ఆకుల నాగేశ్వర రావు విశ్లేషణ ఇది.

 

కారంపుడి a.k.a కారెంపుడి

http://venusrikanth.blogspot.com/2008/06/aka.html

అగ్నిపూలలో ఉండే కాడలతో కోడి పందాలు ఆడారా, మీ బాల్యంలో? పల్లెలో, టూరింగ్ టాకీస్ లో చిల్మా (Cinema) చూసారా? ఘంటసాల గారి "నమో వెంకటేశా" "ఏడుకొండలవాడా" పాటల తో మొదలయ్యే సినిమా అనుభవం గుర్తుందా? ఇంటర్వల్ లో పూరి కూరా తింటూ బెల్ వినిపించగానే, హడావుడిగా చేతులు కడిగేసుకుని హాల్లోకి వెళ్లి కూర్చున్న జ్ఞాపకం గుర్తు తెచ్చుకుంటే ఎలా ఉంటుంది? పౌరుషాలకు పుట్టినిల్లు అయిన కారంపుడి లో తన బాల్య స్మృతులు గుర్తు చేసుకుంటూ రాస్తున్న వేణూ శ్రీకాంత్ కబుర్లు, మిమ్ములనూ, మీ బాల్యం లోకి తీసుకెళ్తాయి.

 

నువ్వు నాకొద్దు

http://www.eemaata.com/em/issues/200511/49.html

డాక్టరు. నిసీ షామల్ భారత్ నుంచి అమెరికా వచ్చిన కొత్తల్లో అక్కడి జీవన విధానం అర్థం కాక అయోమయానికి గురైనా, కొంత కాలం తర్వాత అలవాటు పడ్డాక, అక్కడి జీవన విధానం లో కలిసిపోగలిగింది. హాస్పిటల్ కు వచ్చిన రోగి కి మందులు మాత్రమే కాక నాలుగు మంచి మాటలు స్వాంతనను ఇస్తాయని అనుభవం మీద గ్రహించి, రోగులతో ప్రేమగా ఉంటుంది. ఈ పరిస్థితిలో, డేవిడ్ ఆర్ఠర్ అనే ప్రాస్టేట్ కాన్సర్ తో బాధపడుతున్న రోగి, డాక్టరు. నిసీ షామల్ ఆడ డాక్టర్ అన్న కారణంతో ఆమెతో వైద్య పరీక్షలు చేయించుకోవటానికి నిరాకరిస్తాడు. డాక్టరు. నిసీ షామల్, డేవిడ్ ఆర్ఠర్ కు ఎలా వైద్యం చేసిందన్నది మిగతా కథ. డాక్టర్‌కు రోగికి మధ్య ఉండాల్సిన అవగాహన ప్రాముఖ్యాన్ని, ఈ కథ చక్కగా చెప్తూంది. ఈ కధ రచయిత్రి లైలా యెర్నేని.

లైలా న్యూయార్క్ నగరం గురించి రాసిన కవిత దిగువున ఇస్తున్నాను. చదివి కాసేపు న్యూయార్క్ లో విహరించండి.

 

మనోహర న్యూయార్క్

న్యూయార్క్ నగరంలో
హోటెల్ పెనిన్స్యులా
రూఫ్ టాప్ రెస్టరాంట్ లో
ఓ రాత్రి నేను
నా చనువు చుట్టాలతో చేరి
సురను సేవిస్తున్నా
ఫిఫ్త్ ఏవెన్యూలో ట్రాఫిక్ ని చూస్తున్నా
దూరపు భవనపు గోపురంపై
అస్తమించే సూర్యగోళాన్నీ
వందల అద్దాల్లో ప్రతిఫలించే ఎర్రని
వేల వేల వెలుగులనీ గమనిస్తున్నా
నేపథ్యంలో వినిపిస్తున్న
ఏదో దేశపు కలగలుపు పాటను
అన్యమనస్కంగా వింటున్నా.
ఆ గాయకుడెవరో కాని
అకస్మాత్తుగా
స్వచ్ఛంగా, స్ఫుటంగా
నమో నారాయణా! అని పలికితే
అందరి మాటలూ ఆగిపోయాయి.
మళ్ళీ ఆ పాటగాడు స్పష్టంగా
శంభో శివ!
అంటే, ఏమున్నదో? ఆ మాటల్లో
గుప్తమై శక్తి ఏమున్నదో,
నా ఒళ్ళంతా ఝల్లుమని పోయింది.

 

వయ్యంటే బిడ్డే

http://annisangathulu.blogspot.com/2008/05/blog-post_23.html

ఇండియా టుడే లో ఒక వ్యాసం చదివాను. మన దేశం లో స్త్రీ పురుషుల నిష్పత్తి తగిన విధములో లేదనీ, స్త్రీల సంఖ్య గణనీయంగా తగ్గిందనీ. పంజాబు, రాజస్థాన్ వంటి రాష్ట్రాల లో, ఒకే స్త్రీని, ఇద్దరు ముగ్గురు పురుషులు కలిసి వివాహం చేసుకోవాల్సొస్తుందని, సారాంశం. ఇది విపాత్కార పరిస్థితి. బీహర్ మొదలగు రాష్ట్రాలలో, పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ పరీక్షల సహాయం తో, స్త్రీ భ్రూణ హత్యలెక్కువయ్యాయి. పుట్టబొయ్యే పిల్లలు ఆడ లేక మగ అనేది సృష్టి లో ఎలా నిర్ణయించబడుతుందో, సులభమైన శైలి లో వివరిస్తున్నారు గీతాచార్య.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి