మంగళవారం, మార్చి 18, 2008

తెలుగులో డిగ్ -2




తెలుగు లో డిగ్ పై ఇది నా మూడో జాబు. నిన్న రాజు సైకం, నేడు జల్లెడ జాలయ్య ల లో చైతన్యం వచ్చింది. జల్లెడ లో అనూహ్యమైన మార్పులు, శరవేగంగా వస్తున్నై. జల్లెడ లో కూడ డిగ్ లాంటి feature వచ్చేసింది. కొన్ని functions బేటాలో వుంటే, కొన్ని పనిచెయ్యటం మొదలెట్టాయి.

మొదటగా ఓట్ల జల్లెడ. మీకు నచ్చిన టపాలపై, కొన్ని బ్లాగులలో ఇస్తున్నట్లుగా Star rating ఇచ్చే సౌకర్యం, ఇప్పుడు జల్లెడ లో వుంది. దీనిగురించి వివరణకై చూడండి
http://blog.jalleda.com/?p=33

http://jalleda.com/vote/

ఈ పేజీ లో మీకు నచ్చినవాటికి, మీ కిష్టమైన స్టార్ రేటింగ్ ఇవ్వవచ్చు.

ఇంతే కాదు;ఇప్పుడు జల్లెడ లో ప్రదర్శింపబడుతున్న వాటినే కాకుండా,మీరు ఎంపిక చేసిన బ్లాగరు యొక్క, ఎంపిక చేసిన పాత టపాకు కూడా, మీరు రేటింగ్ ఇవ్వవచ్చు. ఇందుకోసం మీరు authorposts అనే feature వాడవచ్చు.ఇది ఎలా పని చేస్తుందో చూద్దాము. ముందుగా తెరవండి.
http://jalleda.com/vote/
ఇందులో మీకు నచ్చిన బ్లాగర్ పేరు మీద క్లిక్ చేస్తే, ఆ బ్లాగర్ రాసిన టపాలన్నీ ప్రదర్శించే పేజ్ వస్తుంది. ఇప్పుడు మీకు నచ్చిన టపాకు, మీరు ఇవ్వదలచిన * రేటింగ్ ఇవ్వండి.

ఎవరికి వారు రేటింగ్ ఇస్తూ పోతుంటే ఆ విషయం, అదేనండీ ఏ పోస్ట్ కు ఎన్ని స్టార్స్ వచ్చాయో, దాని ద్వారా ఏది ఎక్కువ ప్రజాదరణ పొందిందో, మీ కెలా తెలుస్తుంది అనుకుంటున్నారా? దీనికీ వుపాయం వుంది. పోస్ట్ లను స్టార్ రేటింగ్ ప్రకారం ప్రదర్శించమని ఒక చిన్న ఆజ్ఞ ఇవ్వండి ఇలా.
http://jalleda.com/vote/?order=0
ఇప్పుడు టపాలు మీకు star rating ప్రకారం కనిపిస్తాయి. ఎక్కువ stars గలవి పైన, తక్కువ స్టార్స్ గలవి కిందా వుంటాయి. ఈ పేజ్ మీరిచ్చే star rating పై ఆధారపడి, నిరంతరం మారుతూనే వుంటుంది.ఒక పోస్ట్ కు Five stars వస్తే, ఇంకో పోస్ట్ కు కూడా అన్నే స్టార్స్ వస్తే, తాజాగా 5stars వచ్చినవి పేజ్ పైన వస్తాయని నా ఊహ. ఇది బేటా కాబట్టి అలాగా వుండాలని అభిలాష. అంతే కాక ఇది నెలల వారీగా archives maintain చెయ్యాలని కోరుకుంటా. మీ సూచనలు కూడా పరిగణన లోకి తీసుకొంటామని జాలయ్య గారు చెపుతున్నారు. మీరు కోరుకునే అంశాలు మీరు సూచించవచ్చు. ముద్ర పై నా టపా చూసిన వెంటనే స్పందించిన, జల్లెడ జాలయ్యగారికి నా అభినందనలు.

ఇప్పుడు మనకు జల్లెడ లో కూడా డిగ్ (లాంటిది) వచ్చింది. మిగతా బ్లాగ్ అగ్రిగేటర్లు కూడా, తమదైన పద్ధతిలో ఈ డిగ్ ను వారి వారి సైట్ల లో ప్రవేశ పెట్టే సమయం ఆసన్నమైంది. మరి కొన్నాళ్లకు ఈ మాట, పొద్దు లాంటి పత్రికలు కూడా డిగ్ లాంటి ఎదైనా కొత్త function ప్రవేశ పెడ్తే ఆశ్చర్య పడొద్దు. ఎందుకంటే బ్లాగులలో జరిగే మార్పులు, వారినీ ప్రభావితం చేస్తాయి కాబట్టి.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

సి.బి.రావు గారు,

జల్లెడను మీరు మెచ్చుకోవడం మాకెంతో ఆనందాన్ని కలిగించింది. మీరు ఈ టపాలో వ్రాసిన వోట్ల ఆధారమైన అమరికలు ఇప్పుడు జల్లెడలో ప్రత్యక్షం.

ఓసారి వాటిని చూసి మీ అభిప్రాయం తెలుప గలరు.

-జాలయ్య

కామెంట్‌ను పోస్ట్ చేయండి