సోమవారం, సెప్టెంబర్ 24, 2007

సాహితీవనం -3




సాహితీవనం ప్రశ్నలకు ఉత్సాహంగా బదులిచ్చిన అందరికీ నెనర్లు. జవాబులే కాకుండా ప్రశ్నలకు సంబంధించిన అమూల్యమైన సమాచారం అందించారు.మరో సారి నెనర్లు. ఈ నెనర్లు అంటో ఏమిటో తెలియని వారికి, దీని అర్థం, ధన్యవాదాలు,కృతజ్ఞతలు, అని తెలియజేసిన తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారికి నెనర్లు. గురజాడ ' ప్రేమ ' అనే అర్థం లో వాడారు.నెనరు కున్న అర్థాలులో ఇవి కొన్ని.అవీ కొత్త తెలుగు పదం ముచ్చట్లు.కొత్త తెలుగు పదాలను తెలుసుకోవాలనే ఆసక్తి కల వారు ' తెలుగుపదం ' గుంపులో చేరితే ఉపయుక్తకరంగా ఉండగలదు. సరే, ఇహ మనం సాహితీవనం లో ప్రవేశిద్దాము. మొదటగా ప్రశ్నలకు సరైన సమాధానాలు, దిగువ ఇస్తున్నాను.

అ) " ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు? “అని ప్రశ్నించిన కవి

శ్రీశ్రీ

ఆ) కాలాతీతవ్యక్తులు రచయిత్రిగా డాక్టర్ శ్రీదేవి ప్రసిద్ధిగాంచారు.వీరి కాలాతీతవ్యక్తులు ఈ పత్రికలో సీరియల్ గా వచ్చింది.

స్వతంత్ర

ఇ) రామ భక్త హనుమాన్ -ఈ చిత్రానికి మాటలు, పాటలు రాసిన వారు

శ్రీశ్రీ

ఈ) నిదుర పోరా తమ్ముడా అంటూ సంతానం చిత్రంలో ఆంధ్ర దేశానికే లతా మంగెష్కర్ చేత లాలిపాట పాడించిన సంగీత దర్శకుడు

యస్.దక్షిణామూర్తి

ఉ) ఆరుద్ర రాసిన సినీవాలి అంటే అర్థం

1) చంద్రకళ కానవచ్చెడి అమావాస్య
2) లక్ష్మి

ఊ) ప్రముఖ చిత్రకారుడు సంజీవదేవ్ చనిపోయేదాకా ఇక్కడే నివసించారు.

తుమ్మపూడి

ఎ)' గుత్తొంకాయ కూర మానవ సంబంధాలు ' రాసిన రచయిత

శ్రీరమణ

ఏ) ప్రఖ్యాత కర్ణాటక సంగీత విదుషీమణి ఎం.ఎస్.సుబ్బలక్ష్మి నాయికగా నటించిన చిత్రం

మీరా

ఐ) రాముడికి సీత ఏమవుతుంది పుస్తక రచయిత

ఆరుద్ర

ఒ) తోడికోడళ్లు చిత్రం లోని కారులో షికారు కెళ్లే పాలబుగ్గల పసిడి దానా పాట రాసిన కవి

ఆత్రేయ

అ) François Villon - 15 శతాబ్దపు ఫ్రెంచ్ కవి రాసిన "Where are the snows of yesteryear?", ప్రేరణగా శ్రీశ్రీ రాసిన కవితే ఏవి తల్లి. ఇది ఖడ్గసృష్టి లో ఉంది.
ఆ) డాక్టర్ శ్రీదేవి స్వతంత్ర పత్రికకు సహాయ సంపాదకరాలుగా పని చేశారు. సంపాదకుడు -గోరా శాస్త్రి.
ఇ) రామభక్త హనుమాన్ కు మాటలు పాటలు రాసినది శ్రీశ్రీ. బషీర్‌బాగ్ నుంచి అబిడ్స్ నడుస్తున్నప్పుడు, మహాదేవి అనే డబ్బింగ్ చిత్రం తాలూకు పెద్ద పోస్టర్ కంపించింది చేరా గారికి.పోస్టర్ కింద మాటలు పాటలు శ్రీశ్రీ అని బ్రాకెట్ లో రామభక్త హనుమన్ ఫేం అని రాసుందని చేరా గారు తమ స్మృతికిణాంకం పుస్తకం లో రాశారు.రామ భక్త హనుమాన్ శ్రీ శ్రీ అన్న విషయం చేరా గారిని బాధించిందట.అప్పుడు వారేం చేశారో ఆ కథ తెలుసుకోవాలంటే స్మృతికిణాంకం పుస్తకం చదవండి. మీకు పుస్తకం లభ్యం కాకుంటే, దీప్తిధార కు రాయండి.

ఈ) లతమంగేష్కర్ తో తొలిగా పాట పాడించిన సుసర్ల గారికి ఆంధ్రదేశం రుణపడి ఉంటుంది. ఇది లత ఒంటి గొంతుతో పాడే పాట. ఈ పాట చిత్రం లో రెండు సార్లు వస్తుంది.జునియర్ శ్రీరంజని. నాగెశ్వర రావు, చలం చిన్నప్పుడు, మొదటి సారి,మరలా వారు పెద్దయినప్పుడు. రెండో సారి పాట ప్రధమార్థం లత పాడితే, మిగతా పాట ఘంటసాల పాడారు. లత పాట సినిమా లో theme song గా bits, bits గా పెక్కు సార్లు వస్తుంది.

ఈ పాట విన్నవాళ్లు లతకు తెలుగు రాదంటే నమ్మలేనంత చక్కగా పాడారు. లత అప్పటికే ప్రఖ్యాత గాయని. లత తో తెలుగు లో పాట పాడించటానికి ప్రత్యేక కారణం కనపడదు. మేమే లత తొ మొదటగా తెలుగు లో పాడించాం అన్న ఘనత కోసం తప్ప,వెరే కారణం లేదు. ఇది తలత్ మొహమ్మద్ చేత రమెష్ నాయుడు మనోరమ లో, టి.వి.రాజు రఫీ చేత తెలుగు లో పాడించటానికి ఈ పాట ఆద్య మయ్యింది.అప్పుడు అది వింతే మరి. ఈ రోజు హిందీ గాయకుల తో తెలుగు లో పాడించటం సాధారణ మయ్యింది. లత పాడిన ఎకైక తెలుగు పాట చూసి ఆనందించండి.



(సశేషం)

7 కామెంట్‌లు:

Naga Pochiraju చెప్పారు...

naaku smRtikiNankam kaavaaliiiiiiiiii

బుజ్జి చెప్పారు...

యాభై శాతమే చెప్పగలిగాను నేను.

కారులో షికారు కెళ్ళింది మాత్రం శ్రీ శ్రీ అని నా నమ్మకం. (ఎక్కడో చదివినట్టు గుర్తు)

మొత్తానికి సెకండ్ క్లాస్ ఇచ్చారు నాకు సి.బి.రావ్ గారు

కొత్త రవికిరణ్

cbrao చెప్పారు...

@లలిత - మీకు ఈ పుస్తకం విశాలాంధ్ర, Navodaya Book House, Opposite Arya samaj Mandir,Near Kachiguda X Roads, Hyderabad వద్ద లభ్యమవుతుంది.నేను పంజగుట్ట X Roads లో కల చిన్న బడ్డీ కొట్లో కొన్నాను.

@బుజ్జి -కారులో షికారు పాట రాసింది ఆత్రేయే.సాహితీవనం -4 చూడండి, త్వరలో. మీ పూలవాన బ్లాగులో http://poolavaana.blogspot.com/ పూలు కురవటం లేదు. బద్ధకం వదిలించి, బహరో ఫూల్ బరసావో!

C. Narayana Rao చెప్పారు...

జవాబులతో బాటు, వాటి కథా, కమామీషు, మీరు చెప్పిన తీరు చాలా ఆసక్తిదాయకంగా ఉందండి.

అజ్ఞాత చెప్పారు...

లత పాడిన ఏకైక పాట ...? సందేహమే!
ఆఖరిపోరాటం సిన్మాకు లత పాడారన్నట్లు గుర్తు!

cbrao చెప్పారు...

@Siri -ఉపయోగకరమైన విషయం. ధన్యవాదాలు.

krishnamurthy punna చెప్పారు...

లత పాట మనసును అల్లుకుంది. ఆ బాల నటులెవరొ?

కామెంట్‌ను పోస్ట్ చేయండి