మంగళవారం, అక్టోబర్ 17, 2006

నా నెల్లూరు పర్యటన -1

నెల్లూరు రైలు ప్రయాణం ప్రశాంతి నుంచి e-mail 'దళారి పశ్చాత్తాపం' పుస్తకంపై seminar ఉన్నది - నెల్లూరు రావాలని. పెరుగు రామక్రిష్ణ గారి కవితా సంకలనం ఫ్లెమింగొ - విడిది పక్షుల దీర్ఘ కవిత సమీక్ష చేస్తూ ఉన్నాను. నెల్లూరు దగ్గరే నేలపట్టు ఉన్నది కావున అక్కడికి వెళ్ళి కొన్ని ఛాయా చిత్రాలు కూడ తీయాలని సంకల్పించాను. నేను వస్తున్నట్లు ప్రశాంతి కి కబురు పెట్టాను. 13 అక్టొబర్ 2006 రాత్రి సింహపురి ఎక్స్‌ప్రెస్ లో సికందరాబాద్ నుంచి ప్రయాణం. నేను స్టేషన్ కు వెళ్ళేసరికే ప్రశాంతి, ప్రశాంతి తండ్రిగారు రామప్రసాద్ నా కోసం నిరీక్షిస్తూ కనిపించారు. నేను వచ్చాను కనుక అప్పటిదాక ప్రశాంతి కి తోడుండిన రామప్రసాద్ గారు మాకు వీడ్కోలు చెప్పి వెళ్ళారు. ప్రశాంతి గురించి తెలియని వారి కోసం ఆమె గురించి నాలుగు మాటలు చెప్తాను. ప్రశాంతి M.Sc Computer Science చదివి Technical Writer గా ఒక MNC లో పనిచెస్తున్నారు. దయార్దహ్రుదయురాలు. To Make A Difference, Yahoo group ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు. http://groups.yahoo.com/group/tomakeadifference/ 'దళారి పశ్చాత్తాపం’ పుస్తకం చదివి అందులోని భావాలు మిగతా వారికి కూడ అంద చేయాలనే తలంపుతో పలు సంస్థలు, మిత్రులకు TOMAD Group తరఫున ఈ పుస్తకాన్ని ఉచితంగా అంద చేసారు. నెల్లూరు జిల్లా రచయితల సంఘం తరఫున ఈ పుస్తకంపై గోష్టి కార్యక్రమానికి వారే నడుం కట్టారు. అనారోగ్యంతో ఉన్న ఒక తోటి ప్రయాణీకురాలకు వీడ్కోలు చెప్పటానికై స్టేషనకు వచ్చిన వారిలో ప్రశాంతి నెల్లూరు మిత్రులు కూడా ఉండటం కాకతాళీయం. సుమారు 62 సంవత్సరములున్న వీరు తీవ్ర అనారోగ్యాన్ని కూడ లెక్క చేయకుండా సెన్సార్ బోర్డ్ సభ్యురాలిగా క్రమం తప్పకుండా సెన్సార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సభ్యురాలిగా తనకున్న సౌకర్యాలు, ఒక మహిళా సభ్యురాలిగా సినిమా సెన్సారింగ్ లో గల సాధక బాధకాలు ఎంతో వివరంగా మాకు చెప్పారు. తాను ఇటీవల చూసిన ఒక చిత్రంలో బెడ్ రూం దృశ్యాలు, ఆ వెనువెంటనే బాత్ రూం దృశ్యాలు తనను ఎలా కలవరపెట్టాయో చెప్పారు. వ్యాపార దృక్పధంతో స్త్రీని నగ్నంగా చూపటానికి నిర్మాతల ఆరాటం, సెన్సార్ సర్తిఫికేట్ కోసమై సెన్సార్ బోర్డ్ సభ్యులను ప్రలోభపెట్టడానికి నిర్మాతల ప్రయత్నాలు వివరించారు. ఆ ఉద్యొగం కత్తి మీద సాము లాంటిదన్నారు. వారు ప్రస్తుతము ఇంకా సెన్సారు బోర్డ్ సభ్యులుగా ఉన్నారు కావున వారి పేరు వెళ్ళడించటము భావ్యము కాదు కనుక చెప్పటం లేదు. వీరికి తీరిక సమయం ఎక్కువ. హింది బాషలో మంచి పట్టు ఉంది కనుక మైథిలి శరణ్ గుప్త్ ‘సాకేత్’ (రామాయణంలో తక్కువ పాత్ర వున్న ఊర్మిళ పై రాసిన పద్య మాలిక ) , జయశంకర ప్రసాద్ పద్యకావ్యం, కామాయని ( మానవజాతి భావొద్వేగాలు, ఆలోచనలు, క్రియలను పౌరాణిక పాత్రల ద్వార ఇందులో ఆవిష్కరించారు), ప్రేమచంద్ గబన్ - The Stolen Jewels లాంటి కళాఖండాలను తెలుగులోకి అనువదించమన్న నా సలహాకు ఆమె ఆమోదాన్ని తెలిపారు. నెల్లూరులో వీరికి వీడ్కోలు చెప్పాక, నెల్లూరు స్టేషన్లో ప్రశాంతి మేనమామ శాయిక్రిష్ణ మాకు ఆహ్వానం పలికారు. .వారింటికి రమ్మన్న ఆహ్వానం ఉన్నప్పటికీ, రామక్రిష్ణ గారితో అనేక విషయాలు చర్చింపవలసిన ఆవశ్యకత వలన, నేను, ప్రశాంతి, రామక్రిష్ణ గారింటికే వెళ్ళాలని నిర్ణయించాము.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Rao garu, if you have observed, some of the latest hits in telugu either have A certificate or U/A certificate. A not for adult material, but over dose of violence. Our themes are too violent these days so as common man's perceptions.

Dr. Bhaskar

అజ్ఞాత చెప్పారు...

Premchand's Gaban was translated into Telugu long back and I think Visaalaandhra Publishing House had published it several times. If I remember right, Aluri Bhujanga Rao had translated it from original Hindi.

కామెంట్‌ను పోస్ట్ చేయండి