మంగళవారం, అక్టోబర్ 24, 2006

నా నెల్లూరు పర్యటన -2


Photo by cbrao

నెల్లూరు రాజకీయులూ, కవులూ, కళాకారులూ, నెరజాణలూ

మహాభారతం తెనిగించిన మహా కవి తిక్కన, ఆంధ్ర రాష్ట్రానికై అశువులు బాసిన పొట్టి శ్రీరాములు, Communist విప్లవ యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య ఇక్కడి వారే. మన రాష్ట్రానికి ఇద్దరు ముఖ్య మంత్రులను ఇచ్చిందీ సింహపురి. వారు శ్రీయుతులు నేదురిమల్లి జనార్దనరెడ్డి,



కీ.శే. డాక్టర్ బెజవాడ గోపాల రెడ్డి. మరో రాజకీయ ప్రముఖులు ఎ.సి.సుబ్బారెడ్డి ఇక్కడివారే. నెల్లూరు జిల్లా ఎందరో ప్రతిభావంతులైన రచయితలకు, గాయకులకు, నటులకు జన్మనిచ్చింది.


కృషీవలుడు (The Tiller of the Land) -1919, ఫానశాల రచించిన కవి కోకిల దువ్వూరు రామిరెడ్డి, ఫిడేలు రాగాల పట్టాభి, నిదురించే తోటలొకి పాట ఒకటి వచ్చింది అంటూ మనల్ని నిద్రలేపిన గుంటూరు శేషేంద్ర శర్మ విక్రమ సింహపురివాసులే. రవీంద్రుని గీతాంజలిని తెనిగించిన సాహితీవేత్త, రాజకీయ నాయకుడు. మాజీ గవర్నరూ, కీర్తిశేషులు అయిన డాక్టర్ బెజవాడ గోపాల రెడ్డి, ఆచార్య ఆత్రేయ, పుష్పక్ మూకీ చిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, గాయకుడు బాలసుబ్రమణ్యం, వాణిశ్రీ, రాజనాల వంటి నటీ నటులకు నిలయమైందీ నెల్లూరు. . చిరంజీవి, పవన్ కల్యాణ్ బాల్యంలో ఇక్కడే విద్యనభ్యసించారు. రేగడి విత్తులు రచయిత్రి చంద్రలత,


పలు రచనలు చేసిన డాక్టర్ జయప్రద, పక్షి కథా రచయిత్రి ప్రతిమ ఇక్కడి వారే. ఇంక ఎందరో మహానుభావులు.......



నెల్లూరు పట్టణం

రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఆటో లో రామకృష్ణగారింటికి ప్రయాణమయ్యాము. నా బాల్యంలో అంతగా ఊహ తెలియనప్పుడు ఈ ఊరు వచ్చాను. ఊహవొచ్చాక ఇదే నా ప్రధమ రాక. నెల్లూరు నేను ఊహించిన దానికన్నా చాలా పెద్ద ఊరు. విశాలంగా, సుందరంగా గోచరించింది. ఆంధ్ర కేసరి నగర్లో రామకృష్ణగారి నివాసం. దారిలో మాగుంట కాలనిలో ఎన్నో రమ్య భవనాలున్నాయి. అదే దారిలో మాకు రొట్టెల పండుగ జరిపే దర్గా, Audio cassette library and Braille centre for blind కనిపించాయి. రహదారిమీదే రామకృష్ణ గారు మాకు స్వాగతం పలికి వారి స్వగ్రుహానికి తీసుకెళ్ళారు.

పెరుగు రామకృష్ణ



నా నెల్లూరు ప్రయాణానికి ప్రేరణ, రామకృష్ణగారి ఫ్లెమింగో - విడిది పక్షుల దీర్ఘ కవిత. రామకృష్ణగారిని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. వీరు రాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖలో పని చేస్తున్నారు. మంచి హృదయమున్న కవి, రచయిత. పలు కవి సమ్మేళణాలలో పాల్గొన్నారు. ప్రతిష్టాకరమైన పలు
Photo: cbrao

అవార్డుల బహుమతి గ్రహీత. సభా కార్యక్రమాల నిర్వహణలో దిట్ట.

రామకృష్ణగారు
ప్రధాన కార్యదర్శి నెల్లూరు జిల్లా రచయితల సంఘం
ప్రాంతీయ కార్యదర్శి ఇండియన్ హైకూ క్లబ్
జాతీయ కార్యవర్గ సభ్యులు Indian Society of Authors, New Delhi
ఉపాధ్యక్షులు నెల్లూరు జిల్లా తెలుగు భాషోద్యమ సమితి గా ఉంటున్నారు.



ఆదిలో హంసపాదు

నెల్లూరు పట్టణానికి సుమారు 80 కిలో మీటర్ల దూరంలో నేలపట్టు పక్షి సంరక్షణా కేంద్రం ఉంది. పక్షుల అధ్యయనం, వాటి ఛాయా చిత్రాలు తీయటంపై నాకు అనురక్తి. ఈ నెల్లూరు visitలో నేలపట్టు వెళ్ళాలని నా సంకల్పం. అయితే అక్కడ సంవృద్ధిగా నీరు చేరనందువలన ఇంకా వలస పక్షులు రాలేదని రామకృష్ణ గారు సమచారం అందచేసాక నా నేలపట్టు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాను.

విశిష్ట వ్యక్తి

నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడే తిక్కవరపు సుకుమార రెద్ది గారి గురించి విని వున్నాను. వారిని చూడాలని ఉంది అని ప్రశాంతితో అన్న అర్థగంటకే వారే రామకృష్ణ గారింటికి వస్తున్నట్టుగా కబురందింది. వారిని కలవాలని నా మనసుత్సాహపడింది.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Thanks Sir,
I think Sri Divakarla Venkatavadhani and Actor Sri Ramana Reddy are also from Nellore


Sudesh Pillutla

ramperugu చెప్పారు...

nice narration
ram

కామెంట్‌ను పోస్ట్ చేయండి